News February 6, 2025
చెరుకుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. రాజోలు గ్రామానికి చెందిన ముచ్చు నాగార్జున్రెడ్డి బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొంది. అనంతరం అతన్ని ఆటో కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నాగార్జునరెడ్డి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుణ్ణి చెరుకుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 5, 2025
జిల్లాలో 1,748 పాఠశాలల్లో మెగా PTM: DEO

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,19,396 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
News December 5, 2025
మెదక్: రైతుల కష్టాలపై విద్యార్థుల ప్రదర్శన అదుర్స్

మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు. టీచర్ అశోక్ దేవాజీ మార్గదర్శకత్వంలో దీన్ని రూపొందించారు.
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.


