News May 3, 2024

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్: అరవింద్

image

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోసమే రూ. 43 కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. ఫ్యాక్టరీలు తెరిచేందుకు రూ. 800 కోట్లు అవసరం కాగా ఐదు శాతం నిధులు విడుదల చేశారని విమర్శించారు.

Similar News

News October 1, 2024

NZB: GREAT.. అప్పుడు సర్పంచ్‌గా.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా..!

image

చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013) నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపిక కానున్నాడు.

News October 1, 2024

ప్రమాదవశాత్తు పోచారం కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.

News October 1, 2024

నిజామాబాద్ జిల్లా పీఈటీ టాపర్‌గా రాకేశ్ రెడ్డి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన ఏరా రాకేశ్ రెడ్డి జిల్లాలో పీఈటీ లో 61.50 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో అతనిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, యువకులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి ర్యాంకు సంపాదించడంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.