News February 3, 2025
చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు గట్టి బందోబస్తు: ఎస్పీ
చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News February 3, 2025
NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా
పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.
News February 3, 2025
నల్గొండ: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
నల్గొండ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News February 2, 2025
NLG: రేపటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.