News February 26, 2026

చెరువులను నింపడమే లక్ష్యం: కలెక్టర్

image

పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 195 చెరువులను నింపే ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన అధికారులతో కలిసి కాలువ పనులు, పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. హంద్రీ-నీవా కాలువ 344.90 కిలోమీటర్ (జనకంపల్లి – పుట్టపర్తి రోడ్డు) వద్ద పనులను పరిశీలించారు.

Similar News

News April 14, 2026

TU: రేపటి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ(8,10 సెమిస్టర్) పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ కలశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10-12గం.ల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.

News April 14, 2026

గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 14, 2026

అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

image

హిట్టర్ అభిషేక్ శర్మ‌కు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.