News February 13, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
Similar News
News December 9, 2025
పాలకొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

పాలకొండ మండలం పణుకువలస వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేకుంది. పణుకువలస జంక్షన్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న పొట్నూరు రామినాయుడును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రామినాయుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పాలకొండ మండలం బుక్కూరు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2025
డెక్ భవనంలో మార్పులు!

సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక పార్కింగ్ అంతస్తును ఆఫీస్ స్పేస్గా మార్చేందుకు వీఎంఆర్డిఏ సిద్ధమవుతోంది.
News December 9, 2025
సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


