News February 13, 2025

చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

Similar News

News March 22, 2025

వనపర్తి: ‘మట్టి స్నానంతో చర్మ వ్యాధులు దూరం’

image

ఆయుర్వేదిక్ మట్టి స్నాన కార్యక్రమానికి వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ను యోగా థెరపిస్ట్ శ్రీను నాయక్ కరపత్రాన్ని అందజేసి ఈరోజు ఆహ్వానించారు.. జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈనెల 23న రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో నిర్వహించే మట్టి స్నానంతో వివిధ రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 22, 2025

వనపర్తి: ఆత్మకూరులో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా ఆత్మకూరు, కానాయిపల్లిలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేర్ 38.5, దగడ 38.4, అమరచింత 38.3, మదనాపూర్ 38.2, విలియంకొండ 38.1, పెద్దమందడి 37.9, పానగల్ 37.8, రేమద్దుల 37.6, వెలుగొండ 37.5, వనపర్తి 37.4, జానంపేట 37.2, శ్రీరంగాపూర్ 37.0, గోపాల్‌పేట 36.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 22, 2025

ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

image

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్‌తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!