News February 2, 2025

చెరువుల రక్షణకై హైడ్రా కమిషనర్‌కు TDF రిపోర్ట్

image

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌కు MLC ప్రొ. కోదండరాం, TDF​ అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి చెరువుల రక్షణకు సూచనలతో కూడిన రిపోర్టును అందచేశారు. TGలోని 46,500 చెరువులు, ముఖ్యంగా HYD​తో కలుపుకొని 4 జిల్లాలలోని 1,042 చెరువులకు సంబందించిన డీటేయిల్​ రిపోర్టును అందచేయగా, స్పందించిన హైడ్రా కమిషనర్​ వచ్చే వారం రౌండ్​ టేబుల్​ సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.

Similar News

News February 25, 2026

HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

image

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.

News February 25, 2026

HYD: FSL హాల్‌ టికెట్లపై కీలక అప్డేట్.. రేపట్నుంచే

image

TG ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(FSL) రాత పరీక్షల హాల్‌ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని TSLPRB ఛైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ పీటీసీలో ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

News February 25, 2026

HYD: Weekendలో బెస్ట్ టూర్ ఇదే!

image

నిత్యం ఉరుకుల పరుగుల నగర జీవితంతో అలసిపోయిన వారికి ఈ వీకెండ్‌లో మనశ్శాంతిని పంచే అద్భుత టూర్‌ ఒకటుంది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మానసిక ప్రశాంతతకు నిలయంగా విరాజిల్లుతోంది. HYD నుంచి జస్ట్ 150KM మాత్రమే. అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలను ఒకే చోట చూడొచ్చు. నాగార్జునసాగర్, వాటర్ ఫాల్స్, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉంది. రెండ్రోజులు చిల్ అవ్వొచ్చు. ప్లాన్ చేసుకోండి.