News September 4, 2024
చెర్వుగట్టుపై వ్యక్తి మృతి

నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక సత్యనారాయణ స్వామి మండపం ముందు విగతజీవిగా ఉన్నాడు. చెర్వుగట్టు దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి నార్కట్ పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 28, 2026
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ ఆదేశం

ఎండాకాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.
News February 28, 2026
నల్గొండలో ఉపాధి నిధుల రాజకీయం

నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 211.36 కోట్ల నిధుల పంపిణీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వాటా కోసం పట్టుబడుతుండటమే దీనికి కారణం. గతంలో మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో, తాజా నిధుల కేటాయింపు అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
News February 27, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.


