News February 5, 2025
చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.
Similar News
News February 6, 2025
ఎంజీయూలో అధికారుల పదవీకాలం పొడిగింపు
ఎంజీ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న వివిధ అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిగా సేవలందిస్తున్న డా జి.ఉపేందర్ రెడ్డిని మరో ఏడాది, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా.మిరియాల రమేశ్, ఆడిట్ సెల్ అడిషనల్ డైరెక్టర్గా డా వై.జయంతిని మరో ఏడాది కొనసాగించనున్నారు.
News February 5, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కేశరాజుపల్లికి చెందిన మేకల మహేశ్ (25) పొలం వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 5, 2025
చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు
చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.