News February 1, 2025

చెర్వుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!

image

చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.

Similar News

News February 20, 2025

ఇసుక సరఫరాపై నిఘా పెంచాలి: ఇలా త్రిపాఠి 

image

వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.

News February 20, 2025

ఛాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన 

image

మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఈనెల 25 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె బుధవారం ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 20, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

☞ లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి ☞ దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ☞ నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం  ☞ తనపై దాడులు చేస్తున్నారని శాంతమ్మ అనే వృద్ధురాలి ఆవేదన ☞ ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ☞ శివాజీ జయంతి.. నల్గొండలో భారీ ర్యాలీ 

error: Content is protected !!