News June 7, 2024

చెవిటి పిల్లలకు విజయనగరంలో ప్రత్యేక పాఠశాల

image

విజయనగరం పేర్ల వారి వీధిలో గల చెవిటి పిల్లల పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు సెక్రటరీ కె.ఆర్.డి ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేది నుండి ఉ 9 గం.లనుండి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉచిత విద్య, బాలబాలికలకు వేరు వేరు హాస్టల్లో ఉచిత వసతి కల్పించబడునని, డిజిటల్ క్లాస్ ద్వారా పాఠాలు బోధించబడునన్నారు. వివరాలకు సంప్రదించాలన్నారు.

Similar News

News December 9, 2024

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి: బొత్స

image

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ క్యాడర్‌కు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు సమస్యలపై ఈనెల 13న, విద్యుత్ ఛార్జీల మోతపై27న, విద్యార్థుల సమస్యలపై జనవరి 3న సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. నేతలు ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.

News December 9, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన గొర్లి రాము జీవనోపాధి కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం పాలు పాకెట్ కోసం వెళ్లిన సమయంలో లారీ ఢీకొనడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. రాము మృతి చెందడంతో దత్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 9, 2024

24 గంటల్లో డబ్బులు జమ: మంత్రి

image

డెంకాడ మండలం చందకపేట ధాన్యం సేకరణ కేంద్రం వద్ద రైతులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి గిట్టుబాటు ధర, నగదు జమపై ఆరా తీశారు. రైతులకు అండగా ఉంటామని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.