News July 29, 2024
చెవిరెడ్డికి పొన్నూరు ఎమ్మెల్యే కుమార్తె కౌంటర్
తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ట్వీట్‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి కౌంటర్ ఇచ్చారు. ‘మూడేళ్ల క్రితం నా వయస్సు 23. నేను USలో చదువుతున్నా. అప్పుడు మీ పార్టీ ప్రతీకార రాజకీయాలతో మా నాన్నను అన్యాయంగా అరెస్టు చేశారు. ఆ సమయంలో మేము అనుభవించిన బాధ ఏంటో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News December 10, 2024
తాడేపల్లి: ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం..!
తాడేపల్లిలో ఆదివారం రాత్రి మహిళపై లైంగిక దాడికి తెగబడిన దుండగుడిని పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సీఐ కళ్యాణ రాజు మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు తెంపరల రామారావును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిళ కుమారునితో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. ఆమె ఇంటికి వచ్చి బలవంతం చేయగా ఆమె భయపడి పరుగులు తీశారు.
News December 10, 2024
గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్‌కు 172 అర్జీలు
సుదూర ప్రాంతాల నుండి పిజిఆర్‌ఎస్ లో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించకుంటే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 172 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు
News December 9, 2024
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.