News May 3, 2024
చెవిరెడ్డి దోపిడీ రూ.2 వేల కోట్లు: లోకేశ్

ఒంగోలు YCP MP అభ్యర్థి MLA చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.2 వేల కోట్లు సంపాదించారు. ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టా’ అని లోకేశ్ అన్నారు.
Similar News
News October 19, 2025
ప్రకాశంకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాంధీ

చీమకుర్తికి చెందిన తెల్లమేకల గాంధీని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. తనను నమ్మి పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని గాంధీ తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.