News February 13, 2025
చేగుంట: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు సువర్ణ

చేగుంట ఐసీడీఎస్ సూపర్వైజర్ సైని సువర్ణ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు సీడీపీఓ స్వరూప, డీడబ్ల్యుఓ హైమావతి తెలిపారు. గతనెల 23, 24 తేదీలలో హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్లో ప్రతిభ చూపి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 18 వరకు చెన్నైలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు.
Similar News
News April 23, 2025
మెదక్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత బైక్ మెకానిక్ కోసం గ్రామీణ ప్రాంతానికి చెందిన పురుషులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల వరకు పురుషులు అర్హులని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు, నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో మే 8 వరకు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News April 23, 2025
మెదక్: ఇంటర్లో స్టేట్ ర్యాంక్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాల్లో రేగోడ్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి వెన్నెల ప్రణీత్ కుమార్ 470 మార్కులకు గాను 467 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి విద్యలో ఉత్తమ ప్రతిభ పాటవాలు కనబరుస్తున్నాడు.
News April 23, 2025
239 వాహనాలను తీసుకెళ్లండి: మెదక్ ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు కేసులు, తనిఖీల్లో పట్టుబడిన 239 వాహనాల(టూ వీలర్స్ 224, ఆటోలు 9, ఫోర్ వీలర్స్ 6)ను జిల్లా పోలీసు కార్యలయం వద్ద భద్రపరిచారు. వాహనాల యజమానులు ఎవరైనా గుర్తుపట్టి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకువచ్చి అధికారులకు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.