News April 28, 2024
చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చేగుంట మండలం చిన్న శివునూరు చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంటకు చెందిన బాలరాజు(45) మృతి చెందాడు. చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై చేగుంటకు తిరుగు ప్రయాణమయ్యాడు. చిన్న శివునూరు చౌరస్తా వద్ద కారు తగలడంతో బాలరాజు కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2024
మెడికల్ హాల్స్, ఫార్మసీల్లో తనిఖీలు: రాజనర్సింహ
నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు.
News November 13, 2024
సిద్దిపేట: చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలి: హెచ్ఎండీఏ కమిషనర్
చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలో సర్వే చేసి గుర్తించిన చెరువులు, కుంటల భూవిస్తీర్ణం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
News November 12, 2024
హుస్నాబాద్: మంత్రిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి
హుస్నాబాద్‌లో ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తీర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారన్నారు. గంగర వేణి రవి, జేరిపోతుల జనార్ధన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.