News January 26, 2025
చేజర్ల: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు

చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
Similar News
News December 18, 2025
తమిళనాడు బోట్లతో తీవ్ర ఇబ్బందులు: కలెక్టర్

తమిళనాడు నుంచి జిల్లాలోని సముద్ర జిల్లాలోనికి అక్రమంగా బోట్లు వస్తున్నాయని కలెక్టర్ హిమాన్ష శుక్లా అన్నారు. అమరావతిలో CM ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షలో ఆయన మాట్లాడారు. తమిళనాడు బోట్లతో జిల్లా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్ష్ CMకు విన్నవించారు. జువ్వలదిన్నె హార్బర్‌ను కార్యాచరణలోకి తీసుకొస్తే సమస్యను పరిష్కరించవచ్చన్నారు.
News December 18, 2025
నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.