News March 23, 2025

చేతబడులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు : ఎస్పీ అమిత్ 

image

మూఢనమ్మకాలు నమ్మవద్దని గన్నెల పీహెచ్సీ వైద్యులు డా కమలకుమారి, డా. కనికినాయుడు పేర్కొన్నారు. అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగుడలో చేతబడి నెపంతో వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు SP అమిత్ బర్ధర్ ఆదేశాలతో గన్నెల పీహెచ్‌సీ వైద్యులు శనివారం ఆ గ్రామానికి వెళ్లి చేతబడులపై అవగాహన చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. CI హిమగిరి, MPDO లవరాజు, MRO ప్రసాద్ ఉన్నారు.

Similar News

News April 22, 2025

మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

image

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్‌నెస్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్‌ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 22, 2025

16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

image

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.

News April 22, 2025

జాగ్రత్త.. పోలీసులమని చెబితే నమ్మకండి: ADB DSP

image

సివిల్ డ్రెస్సులో పోలీసులమంటూ వాహన తనిఖీలు నిర్వహించినా, విలువైన ఆభరణాలు అడిగినా, వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించలని ADB DSP జీవన్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బేల మండలంలో నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ బంగారం అపహరించారని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ నూతన పద్ధతులలో మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల చెర నుంచి తప్పించుకోవాలని సూచించారు.

error: Content is protected !!