News January 30, 2025
చేనేతలకు విరివిరిగా రుణాలు ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

చేనేత కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేతలకు విరివిరిగా రుణాలు ఇవ్వాలని, అర్హులైన చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు.
Similar News
News December 1, 2025
జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.


