News February 17, 2025
చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచటానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
Similar News
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 12, 2025
పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.