News February 17, 2025

చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

image

చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచటానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

Similar News

News November 1, 2025

SRCL: ‘తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి’

image

తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇటీవల మొంథా తుఫాన్‌తో జిల్లాలో జరిగిన నష్టం అంచనాలు రూపొందించడంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా పాక్షికంగా, పూర్తిగా నష్టపోయిన ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 1, 2025

సిరిసిల్ల: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురి అరెస్ట్

image

సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

News November 1, 2025

వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.