News April 4, 2024

చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు..?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 103 చేనేత, జౌళి సంఘాలు ఉన్నాయి. వీటిలో 13 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీకాలం గడువు 2018 ఫిబ్రవరి 10 నాటికి ముగిసింది. అప్పటినుండి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

Similar News

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.

News December 12, 2025

MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.