News February 26, 2026
చేపల్లో శంకుపూత వ్యాధిని ఎలా నివారించాలి?

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.
Similar News
News April 16, 2026
బోధన్: వైద్య సిబ్బందికి HMISపై శిక్షణ

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.
News April 16, 2026
US అడ్డుకున్నా చమురు సరఫరాలో ఇరాన్ తగ్గట్లే!

చమురు సరఫరాను అడ్డుకునేందుకు నేవీని US రంగంలోకి దింపినా ఇరాన్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏప్రిల్ 13న నుంచి ఇప్పటివరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫ్లోటింగ్ స్టోరేజ్‌లో ఉన్న 9 మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించింది. ఇక US నౌకలు రాకముందు అంటే ఏప్రిల్ 12న మరో రెండు మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించినట్లు సమాచారం. మరోవైపు గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధిని 11 నౌకలు క్రాస్ చేసినట్లు ట్రాకింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.