News February 21, 2025
చేబ్రోలు మహిళకి జీబీఎస్ పాజిటివ్

ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓ మహిళకు జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి జీబీఎస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కలిదిండి సుబ్బరాజు వర్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఫీవర్ సర్వే చేపట్టారు.
Similar News
News December 3, 2025
ఖమ్మం: ఆ గ్రామం 7వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక

కామేపల్లి మండలం పాతలింగాల గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవితో పాటు మొత్తం 8 వార్డు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కిన్నెర సుజాత సర్పంచ్గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి సారథ్యంలో ఈ జీపీని ముచ్చటగా ఏడోసారి ఏకగ్రీవంగా గెలుచుకుని, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించారు.
News December 3, 2025
బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
News December 3, 2025
సిద్దిపేట: సర్పంచ్ గిరి అస్సలే వద్దు..!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి పలువురు తాజా మాజీలు వెనుకంజ వేశారు. పల్లెపోరులో కొత్తవారే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 514 GPల పరిధిలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు దశల్లోనూ తాజా మాజీ సర్పంచులు పోటీకి ఆసక్తి చూపట్లేరు. సర్పంచ్ గిరితో నష్టమే తప్ప లాభం లేదని, గతంలోని బిల్లులే పెండింగ్లో ఉన్నాయని, నిధులు రావని వారు భావిస్తున్నారు.


