News March 16, 2025
చేబ్రోలు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్ SI అప్పారావు శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు తెలుపు రంగుపై చిన్న గీతలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బిస్కెట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.
Similar News
News September 17, 2025
ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
News September 17, 2025
హార్టీకల్చర్ కోర్సులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం: శ్రీనివాసులు

తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో బీఎస్సీ హార్టీకల్చర్, ఫారెస్టరీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 18వ తేదీ లోపు కాలేజీ ఎంపికకు అవకాశం కల్పించారన్నారు.
News September 17, 2025
ఈనెల 17 నుంచి జిల్లాలో పోషణ మాసోత్సవాలు: కలెక్టర్

ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది ప్రమాదకరంగా మారిందన్నారు.