News March 16, 2025

చేబ్రోలు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్ SI అప్పారావు శనివారం తెలిపారు.‌ ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు తెలుపు రంగుపై చిన్న గీతలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బిస్కెట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.

Similar News

News April 19, 2026

ప.గో: కాలువలో మృతదేహం కలకలం

image

ఉండి మండలం ఎన్ఆర్‌పీ అగ్రహారం గ్రామ పరిధి చెరువుగట్టుపాలెం వద్ద గల పంట కాలువలో ఆదివారం ఒక గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News April 19, 2026

ప.గో జిల్లాలో ఎండు గడ్డికి పెరిగిన డిమాండ్

image

జిల్లాలో ప్రధానంగా డెల్టా, కొల్లేరు తీరప్రాంతాల్లో ఆక్వా చెరువులు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో పశుగ్రాసం, ముఖ్యంగా ఎండు గడ్డి కొరత పశు పోషకులను వెంటాడుతుంది. పశువుల పెంపకం కోసం ప్రస్తుత దాళ్వా మాసూళ్లు జరుగుతున్న క్రమంలో ధాన్యానికన్నా ముందుగానే ఎండు గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఎండు గడ్డి ధర రూ.8-10వేలు పలుకుతోంది.

News April 19, 2026

భీమవరంలో చికెన్ ధర ఎంతంటే?

image

భీమవరంలో ఆదివారం మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. బాయిలర్ కోడి కిలో రూ.300, ఫారం కోడి రూ.260కు చేరగా.. మటన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే చికెన్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. చేపలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి