News March 11, 2025
చేయిచేయి కలిపి వాననీటిని ఒడిసి పడదాం: కలెక్టర్

వాననీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరుగుతాయని, ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో భూగర్భ జలాలది కీలకపాత్ర అని జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా జల్ సంచయ్ జన్ భాగీదరిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News February 10, 2026
పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు బాధితులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి డీఎస్పీ వెంకటరమణ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.


