News March 23, 2024
చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: ఎంపీ
కాంగ్రెస్ అధిష్ఠానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని HYDలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News September 10, 2024
BREAKING: 5 నెలల్లో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు SUSPEND
TG వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 5 నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు, రోడ్ సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 6,916 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు HYDలో రవాణా శాఖ వెల్లడించింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ చేసిన వారివి సస్పెండ్ చేశామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు సస్పెండ్ తప్పదని హెచ్చరించారు.
News September 10, 2024
HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
News September 10, 2024
HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన
HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.