News May 3, 2024

చేవెళ్ల: 18 నుంచి 39 ఏళ్లలోపు యువ ఓటర్లు 15,20,890 మంది

image

చేవెళ్ల పార్లమెంట్‌‌లోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్లలోపు యువ ఓటర్లు మొత్తం 15,20,890 మంది ఉండగా.. 40-49 ఏళ్ల వయస్సు ఓటర్లు 6,07,268 ఉన్నారు. 50-59 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,62,074, 60-69 ఏళ్ల వయస్సు ఓటర్లు 2,13,014, 70-79 వయస్సు ఓటర్లు 1,02,115, 80-89 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 26,226 ఉండగా.. 90-99 ఏళ్ల వయస్సు ఓటర్లు 4,531 మంది ఉన్నారు.

Similar News

News November 2, 2024

ముషీరాబాద్‌‌లో 2 వేల కిలోల దున్నరాజు

image

ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో‌ ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు‌ ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.

News November 2, 2024

HYD: ఓపెన్ డిగ్రీ, PG.. మరో అవకాశం

image

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి నవంబరు 15 వరకు గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.

News November 2, 2024

HYD: GET READY.. 21 వేల మందితో సర్వే..!

image

గ్రేటర్ HYDలో సకుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 21 వేల ఎన్యుమరేటర్లు, రిసోర్స్ పర్సన్లు, సూపర్‌వైజర్లు పాల్గొంటారని మున్సిపల్ & అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ గౌరీ శంకర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు.ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభం కానుండగా.. 100 శాతం ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.