News May 25, 2024
చైనా ఏజెంట్ల వలలో శ్రీకాకుళం జిల్లా వాసి

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కొందరు ఏజెంట్లు నమ్మించిన ఘటనలో పలాస వాసి
ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని చైనా, కాంబోడియా కంపెనీల ఏజెంట్లకు అప్పగించారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. భారత రాయబార, విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కొందరు రెండు విమానాల్లో శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. వారిలో పలాస వాసి ఉన్నట్లు గుర్తించారు.
Similar News
News October 19, 2025
అనుమతి లేని బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బాణసంచా సామాగ్రిని విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న షాపుల యజమానులు మాత్రమే అమ్మకాలు జరపాలని, కాలుష్య రహిత క్రాకర్స్ను వినియోగిస్తే మంచిదని ఆయన తెలిపారు.
News October 18, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను యూనివర్సిటీ డీన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్ చివరి వారంలో జరుగుతాయని వెల్లడించారు.
News October 18, 2025
బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్

బాణసంచా దుకాణాల వద్ద పటిష్ట భద్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శనివారం సాయంత్రం టెక్కలిలో పర్యటించిన ఆయన ముందుగా దీపావళి సామాగ్రి దుకాణాలను పరిశీలించారు. అనంతరం టెక్కలిలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈయనతో పాటు ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్ధార్ సత్యం, ఎంపీడీఓ రేణుక, ఈఓ శ్రీనివాసరావు తదితరులున్నారు.