News May 26, 2024

చైనా కంపెనీ నిర్బంధంలో విశాఖ యువకుడు

image

చినముషిడివాడకు చెందిన తెరపల్లి రాజేష్(33) బ్యాంకాక్‌లో చైనీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్నాడు. ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేసిన రాజేష్ థాయిలాండ్‌లో ఉద్యోగానికి గత నెల 25న బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈనెల 10న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇండియా వెళ్లాలంటే రూ.8 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తండ్రి శివకి చెప్పాడు. ఈ మేరకు తండ్రి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.

Similar News

News October 25, 2025

విశాఖ మత్స్యకారులకు గమనిక

image

తుఫాను ఏర్పడిన నేపథ్యంలో సముద్రంపై మత్సకారులకు వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు సూచించారు. బీచ్ రోడ్డులోని జాలరిపేట వద్ద తుఫాన్ విషయంపై ముందస్తు జాగ్రత్తలు వివరించారు. సముద్రంలో వేట సాగిస్తున్న ఫిషింగ్ బోట్లు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. తీరంలో భద్రపరచుకున్న సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. సమస్య ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.

News October 25, 2025

విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

News October 25, 2025

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

image

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.