News January 15, 2025
చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు

చైనా మాంజా దారం తగిలి బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాయాలైన ఘటన బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగింది. స్థానికుల వివరాలిలా.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 13, 2025
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలి

రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకులు రాజు గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని గురువారం మాల మహానాడు జాతీయ నాయకులు రాజు మాట్లాడుతూ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు సంఘాలు బందుకు పిలుపునిచ్చాయని, ఈ బంధును విజయవంతం చేయాలన్నారు.
News February 13, 2025
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 13, 2025
నల్గొండ: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్‌ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.