News January 8, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ SP

నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వాడితే ప్రజలు, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా మాంజా కట్టడికి పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Similar News
News October 25, 2025
మొక్కల నాటే లక్ష్యం వంద శాతం పూర్తి: ఆదిలాబాద్ కలెక్టర్

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న మొక్కల నాటకం వంద శాతం పూర్తయిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు ఈత 23,400, మహువా 70,187, బాంబు 1,04,583 మొక్కలు నాటడం జరిగిందని, జియో ట్యాగింగ్ 97 శాతం పూర్తయిందని వివరించారు. పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 17,27,726 మొక్కలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 48 పాఠశాలల్లో 4,250 కూరగాయల మొక్కలు నాటినట్లు తెలిపారు.
News October 24, 2025
ADB: నేటి నుంచి పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్స్ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ఈనెల 27 నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించనుండగా ఈ రోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంట విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
News October 24, 2025
ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.


