News October 31, 2024

చొప్పదండి ఎమ్మెల్యేకు బెదిరింపులు.. లుక్ అవుట్ జారీ

image

KNR జిల్లా చొప్పదండి MLA మేడిపల్లి సత్యంను ఫోన్, వాట్సాప్‌లో బెదిరించిన వ్యక్తిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్‌అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. MLA సత్యంకు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా నిందితుడు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో తనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, కేసు నమోదైంది.

Similar News

News September 18, 2025

KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ 2వ విడత స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సుల్లో 57 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సమయానికి హాజరుకావాలన్నారు.

News September 17, 2025

HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

image

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

News September 17, 2025

KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

image

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.