News February 24, 2025
చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News February 24, 2025
కరీంనగర్ : జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరకు వినతి

ఈ రోజు కరీంనగర్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టుల కార్యదర్శి కుడి తాడి బాపురావు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సమర్పించారు. బాపురావు మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు హుజురాబాద్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ తదితర సౌకర్యం కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు.
News February 24, 2025
కరీంనగర్: పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం: కలెక్టర్

ఈ నెల 27న జరిగే MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటన లో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుండి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై నిషేధం అని తెలిపారు.
News February 24, 2025
కరీంనగర్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.