News February 24, 2025
చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
News March 28, 2025
కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.
News March 27, 2025
డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు