News September 25, 2024
చొప్పదండి: నవోదయ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల దరఖాస్తు గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించినట్టు చొప్పదండి నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 8, 9వ తేదీల్లో దరఖాస్తుదారులు మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు.
Similar News
News October 15, 2024
దసరా.. కరీంనగర్ జిల్లాలో రూ.166 కోట్ల మద్యం తాగేశారు!
KNR జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.166 కోట్ల మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.139 కోట్ల మద్యం విక్రయించినట్లు పేర్కొన్నారు. KNR జిల్లాలో రూ.46 కోట్లు, PDPL రూ.39 కోట్లు, JGTL రూ.41 కోట్లు, SRCL జిల్లాలో రూ.34 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.27 కోట్ల వ్యాపారం అధికంగా జరిగినట్లు పేర్కొన్నారు.
News October 15, 2024
జగిత్యాల: అర్దరాత్రి దారుణ హత్య
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్(33) అనే యువకుడిపై సోమవారం అర్దరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2024
KNR: మంత్రగాళ్లు జాగ్రత్త.. కట్లకుంటలో వెలిసిన పోస్టర్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. గ్రామ కూడలిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. తమ సంస్థకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్కరిని చంపబోతున్నామని, ముందుగా గచ్చునూతి వద్ద గల ఇద్దరితో మొదలుపెట్టి ఇతర వీధుల్లో ఉన్నవారిని హతమార్చుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.