News March 14, 2025

చొప్పదండి: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన పూసాల రోహిత్(17) కరీంనగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోహిత్ పెద్దమ్మ రావుల అరుణ నిద్రలేచి చూడగా.. వరండాలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడనే భయంతో ఉరేసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

image

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్‌లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.

News March 15, 2025

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

News March 15, 2025

ఎచ్చెర్ల : రోడ్డు ప్రమాదంలో చెన్నై వాసి మృతి

image

జరజాం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాశ్(35) శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తూ.. జరజాం జంక్షన్ సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!