News March 21, 2025

చొప్పదండి: భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

image

చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 23, 2025

గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

image

కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.

News March 23, 2025

కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

News March 23, 2025

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

image

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

error: Content is protected !!