News February 18, 2025

చొప్పదండి: విండోను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బృందం

image

చొప్పదండి సింగిల్ విండోను సోమవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, అధికారుల బృందం సందర్శించింది. సొసైటీ పనితీరు, రైతులకు అందించే సేవలను పాలకవర్గం వారికి వివరించింది. సొసైటీ సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వ్యవసాయ రుణాల రికవరీ 100 శాతం చేశామని, ఇతరు రుణాలు 85 శాతం వరకు రికవరీ చేశామని చెప్పారు.

Similar News

News October 29, 2025

‘ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

image

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంచాలని, ప్రతి ఉద్యోగికి తన పనిలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 28, 2025

KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

image

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.