News August 16, 2024
చోడవరం కార్మిక శాఖ అధికారికి ప్రతిభ అవార్డ్
చోడవరం కార్మిక శాఖ సహాయ సంక్షేమ అధికారి పీ.సూర్యనారాయణకు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉత్తమ అధికారిగా ప్రతిభ అవార్డు లభించింది. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. కార్మిక శాఖ అధికారికి అవార్డు లభించడం పట్ల భవన నిర్మాణ కార్మికులు, యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 13, 2024
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ
ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.
News September 12, 2024
అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 12, 2024
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో బెంచ్ మార్క్
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరకు రవాణాలో కొత్త బెంచ్ మార్కులు నమోదు చేసుకుంది. 160 రోజుల్లో 100 మిలియన్ టన్నుల సరకును అన్‌లోడ్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరకు రవాణాలో 6.5% వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త రోడ్ డివిజన్లో 60.38 మిలియన్ టన్నులు, సంబల్పూర్ డివిజన్లో 17.382లో సరకు రవాణా చేసినట్లు వివరించారు.