News April 3, 2025
చోడవరం: చెట్టు పైనుంచి జారిపడి మృతి

చోడవరం మండలం నరసయ్యపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కిన కల్లుగీత కార్మికుడు మేడిశెట్టి నూకరాజు (30) ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 11, 2025
విశాఖ: సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రెండో శనివారం సెలవు రద్దు

విశాఖలో రెండో శనివారం ఎటువంటి సెలవు ఉండదని జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. విశాఖలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు కాగా ఈ వారం మాత్రం ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయలు పనిచేస్తాయని తెలిపారు.
News April 11, 2025
గుడిపాడులో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసిన జేసీ

కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని మునగాల, మల్లాపురం, గుడిపాడు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ నవ్య పర్యటించారు. శుక్రవారం గుడిపాడులో రూ.8 లక్షల కుడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేశారు. తాగునీటి సమస్యపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంతృప్తిని చూసి జేసీ సంతోషం వ్యక్తం చేశారు. కుడా నిధులతో అభివృద్ధి పనులు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో MRO, AO పాల్గొన్నారు.
News April 11, 2025
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత

మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కార్వాన్ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల ఐక్య పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు.