News February 13, 2025

చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

Similar News

News November 24, 2025

కొహీర్: జీపీవో రాష్ట్ర కార్యదర్శిగా మల్లీశ్వరి

image

కొహీర్ మండల కేంద్రంలో జీపీవోగా పనిచేస్తున్న నీరుడి మల్లీశ్వరి రాష్ట్ర స్థాయి కీలక పదవికి ఎంపికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జీపీవో రాష్ట్ర సదస్సులో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర జీపీవో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి మల్లీశ్వరి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

News November 24, 2025

ఏలూరు: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

image

జీలుగుమిల్లి (M)కామయ్యపాలెం సమీపంలో వాగులో స్నానానికి దిగి తెలంగాణలోని అశ్వారావుపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందగా.. మనుమడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో దొంతికుంట గ్రామంలో విషాదం అలుముకుంది.

News November 24, 2025

NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .