News February 13, 2025
చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
Similar News
News March 28, 2025
బాపట్ల జిల్లాకు మంచి రోజులు..!

బాపట్ల జిల్లాకు నిన్న ఒక్కరోజే రెండు శుభవార్తలు అందాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. నిజాంపట్నం(M) పరిశవారిపాలెం(దిండి) వద్ద రూ.88.08 కోట్లతో ఆక్వా పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ రూ.25.79 కోట్లతో చేపలు, రూ.18.58 కోట్లతో రొయ్యలు, రూ.9.88కోట్లతో పీతలకు బ్లాక్స్ నిర్మిస్తారు. అలాగే రూ.13.78 కోట్లతో సీ ఫుడ్ పార్కు ఇతర పనులు చేపడతారు.
News March 28, 2025
రేపు సూర్యగ్రహణం

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.
News March 28, 2025
తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.