News April 9, 2025

చోరీ నగదే హత్యకు కారణం: అనకాపల్లి డీఎస్పీ 

image

చెన్నైలో చేసిన చోరీ సొమ్ము విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదంతోనే కొలిపాక పవన్ కుమార్ హత్యకు గురయ్యాడని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన వేపాడ నరేంద్ర కుమార్ చెన్నైలో చోరీ చేసిన సొమ్ముతో ఇక్కడకు వచ్చి స్నేహితులతో జల్సా చేశాడన్నారు. ఈ క్రమంలో కొంత సొమ్ము హతుడు పవన్ కుమార్ దొంగలించాడన్న అనుమానంతో నరేంద్ర కుమార్ బీరు సీసాతో పొడిచి హత్య చేశాడని వెల్లడించారు.

Similar News

News April 17, 2025

ఈ-వేస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల‌తోపాటు అన్ని మండలాల్లోఈ నెల 19 నాటికి ఈ-వేస్ట్ సేక‌ర‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, ఈఓపిఆర్డిలతో క‌లెక్ట‌ర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంపై స‌మీక్షించారు. 13 శాఖలు భాగస్వామ్యం కావాలని ఆయా శాఖల పరంగా చేయవలసిన విధులు, అంశాలను వివరించారు.

News April 17, 2025

మేము హిందూస్ కానీ.. హిందీస్ కాదు: రాజ్ ఠాక్రే

image

జాతీయ భాష కాని హిందీని ప్రాథమిక తరగతిలోనే నేర్చుకోవాల్సిన అవసరమేముందని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్రలో NEPని అమలు చేయడాన్ని సహించేది లేదని ట్వీట్ చేశారు. తామంతా ‘హిందూస్ కానీ.. హిందీస్ కాదు’ అన్నారు. NEPని అమలు చేస్తే పోరాటం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. మరాఠీ, నాన్ మరాఠీ ప్రజల మధ్య గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని భావిస్తుందని ఆయన ఆరోపించారు.

News April 17, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!