News March 11, 2025
చౌటుప్పల్‌లో తాగు నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్షా

వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం. హనుమంత రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్‌లో మంచి నీటి సరఫరాపై పంచాయతీ కార్యదర్శిలతో సమీక్షా నిర్వహించారు. బోర్‌వెల్స్, హ్యాండ్‌పంప్‌లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల పరిస్థితి, లీకేజీలపై పరిశీలన చేసి ట్యాంకుల మరమ్మతులు చేయించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 16, 2026
సూర్యాపేట: ఇంటర్ ఫలితాల హోరు.. అడ్మిషన్ల జోరు!

ఇంటర్ ఫలితాలు విడుదలైన మూడు రోజుల్లోనే సూర్యాపేట జిల్లాలో విద్యా వ్యాపారం ఊపందుకుంది. టాపర్ల ఫోటోలతో విద్యాసంస్థలు ప్రకటనల హోరు మొదలుపెట్టాయి. ఉచిత సీట్లు, ఫీజు రాయితీలను ఎరగా వేస్తూ ప్రైవేట్ కళాశాలలు ప్రచారానికి దిగాయి. మరోవైపు, ప్రతినిధులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికల్లో ర్యాంకుల హడావుడితో అడ్మిషన్ల ప్రక్రియ జిల్లాలో జోరుగా సాగుతోంది.
News April 16, 2026
కొత్తగూడెం: జూనియర్ కళాశాల వద్ద క్షుద్ర పూజల కలకలం

మణుగూరు జూనియర్ కళాశాల హరీకి ఆనుకొని ఉన్న రోడ్డుపై ముగ్గులు, నిమ్మకాయలతో కూడిన క్షుద్రపూజల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఉదయాన్నే కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాల ప్రాంగణంలో ఇలాంటి చర్యలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెంచి ఆకతాయిల పనినా లేక మరేదైనా కారణమా అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
News April 16, 2026
బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ రిటైర్మెంట్

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్(36) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ జట్టు తరఫున 27 టెస్టులు, 104 వన్డేలు, 28 టీ20లు ఆడి 193 వికెట్లు పడగొట్టారు. 2021 ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 మ్యాచే ఆయనకు చివరిది. గాయాలతో అప్పటి నుంచి జట్టుకు దూరమవుతూ వచ్చారు. ఇక వన్డేల్లో అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా రుబెల్ పేరిట రికార్డ్ ఉంది.


