News March 26, 2025
చౌటుప్పల్: ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపిక

చౌటుప్పల్కు చెందిన రమావత్ సరిత అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరఫున ఎంపికయ్యారు. B.P.Ed మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె 3వ బేస్ ప్లేయర్గా తన స్థానం దక్కించుకున్నారు. ఏప్రిల్లో నెల్లూరులో జరగనున్న ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు పోటీపడనున్నారు.
Similar News
News November 21, 2025
ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.
News November 21, 2025
నేషనల్ న్యూస్ రౌండప్

* జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
* బిహార్లో 27 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి హోంశాఖ కేటాయింపు
* శబరిమల గోల్డ్ చోరీ కేసు.. బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
* డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన TVK విజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
News November 21, 2025
ఖమ్మం: ‘సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోండి’

ఉమ్మడి జిల్లాలో ఆడ, మగ మొక్కజొన్న సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్ల విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్ గోపికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షుడు రవిచందర్ ఫిర్యాదు చేశారు. అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని, అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తూ నష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


