News February 28, 2025
చౌటుప్పల్: కండక్టర్‌పై ప్రయాణికుడి దాడి

కండక్టర్‌పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చౌటుప్పల్‌లో జరిగింది. సీఐ వివరాలు.. పట్టణానికి చెందిన జంగయ్య దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో కండక్టర్ శ్రీధర్ రెడ్డి చిల్లర లేదని వెనకాల రాసి ఇచ్చాడు. బస్సు దిగగానే ముగ్గురికి కలిపి డబ్బులు ఇవ్వగా జంగయ్య గొడవ పడి క్షణికావేశంలో దాడి చేశాడు. శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 15, 2025
జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.
News March 15, 2025
ఎముకలు దృఢంగా ఉండాలంటే…

మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం.. కాల్షియంతో పాటు డీ, కే విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొంత మోతాదులో అవసరమే. అంజీర్, సముద్రపు చేపలు, బాదంపప్పులో ఇవన్నీ లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
News March 15, 2025
అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అధికారులు తోడ్పడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్,ట్రైనింగ్ సెంటర్, డెయిరీల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.