News April 14, 2025

చౌటుప్పల్: పేకాట రాయుళ్ల అరెస్ట్

image

చౌటుప్పల్‌లో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని రాంనగర్ కాలనీ శివారులో ఆరుగురు జూదం ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5,800 నగదుతో పాటు ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 14, 2025

బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

image

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్‌లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.

News November 14, 2025

నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం

News November 14, 2025

శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి!

image

శ్రీశైలం క్షేత్రంలో నేడు సాయంత్రం కోటి దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం ప్రతిష్టాత్మకంగా మొదటిసారి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.