News April 14, 2025

చౌటుప్పల్: పేకాట రాయుళ్ల అరెస్ట్

image

చౌటుప్పల్‌లో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని రాంనగర్ కాలనీ శివారులో ఆరుగురు జూదం ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5,800 నగదుతో పాటు ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News April 17, 2026

కేంద్ర మంత్రితో ప్రేమ.. కంగనా రనౌత్ క్లారిటీ!

image

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘చిరాగ్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పదేళ్ల కిందట మేం కలిసి సినిమా చేశాం. ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండే వారు. ఇన్నేళ్లలో మా బంధంలో ఎలాంటి మార్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. కంగనా, చిరాగ్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించారు.

News April 17, 2026

రోజూ తలస్నానం చేయొచ్చా?

image

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.

News April 17, 2026

APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

image

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్‌-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్‌-Cకు 35, సైంటిస్ట్‌-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.