News July 4, 2024

చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఇలా..

image

చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి NHAI రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారిపై 2.45 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లేదారి నుంచి వలిగొండ చౌరస్తా వరకు మట్టితో వంతెనను నిర్మిస్తారు. మధ్యలో ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్ల పొడవు మట్టి కట్ట కాకుండా సిమెంట్ పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News March 11, 2025

పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయాలి: ఎస్పీ

image

సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఈరోజు జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు.నేర నియంత్రణలో బాగంగా అన్నీ ప్రాంతాలలో సిసిటివి కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు,సిబ్బంది పని పనిచేయాలని ఆదేశించారు.

News March 11, 2025

పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రబిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News March 11, 2025

ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

image

MGU పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు సీఈవో డా. జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 1వ సెమిస్టర్ ఏప్రిల్ 11, 3వ సెమిస్టరు APR 16, 5వ సెమిస్టర్ APR15 నుండి బ్యాక్లాగ్ విద్యార్థులకు, 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఏప్రిల్ 16 నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ MGU వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!